బతుకమ్మ వేడుకలకు కవిత దూరమైనట్లేనా..?? కార్యకర్తలు జరుగుతున్న తాజా చర్చ ఇదే..

-

రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా.. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగకు కవిత బ్రాండ్ అంబాసిడర్ లాంటిది.. ఆడబిడ్డల సంబరాన్ని అంబరాన్ని తాకేలా కవిత చేసారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.. కారణాలు ఏవైనా.. ఈసారి బతుకమ్మ పండుగకు ఆమె దూరంగా ఉండటం పొలిటికల్ గానే కాకుండా ట్రెడిషనల్ గా కూడా చర్చనీయాంశంగా మారింది.. పండుగలతో జనాన్ని జాగృతం చేసి ఉద్యమాలలో వారిని భాగం చేయొచ్చు అని కవిత నిరూపించారు.. ఉద్యమాలలో పూల పండుగను భాగం చేసిన కవిత ఈసారి జరిగే బతుకమ్మ వేడుకలలో పాల్గొనే పరిస్థితుల్లో లేరనేది పార్టీ వర్గాలు చెబుతున్న మాట.. ఈసారి ఆమె బతుకమ్మ వేడుకలలో పాల్గొనక పోవడం.. పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదాన్ని కలిగిస్తోందట..

తండ్రి కెసిఆర్ తెలంగాణ జెండాన్ని భుజానికి ఎత్తుకొని ఉద్యమాలు చేస్తుంటే.. జన జాగృతిని స్థాపించిన కవిత.. పూల పండుగను తన పోరాటానికి వేదికగా చేసుకుంది. నేటితరం మర్చిపోయిన బతుకమ్మకు.. ఆమె జీవం పోశారని.. ఊరురా తిరుగుతూ ఆడపిల్లలతో కలిసి బతుకమ్మ ఆడుతూ.. తెలంగాణకే సొంతమైన పండుగలో మరోసారి వెలుగులు నిండేలా చేసారని.. ఆమె అనుకూల వర్గం చెబుతున్న మాట.. గ్రామీణ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా జరిగే బతుకమ్మ పండుగను దేశ విదేశాలకు చాటి చెప్పింది ఆమె.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం అధికారికంగా ట్యాంక్ బండ్ మీద ఉత్సవాలు నిర్వహించడం లో కవిత కీలక పాత్ర పోషించారు..

గడిచిన పదేళ్లలో ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క జిల్లాలో బతుకమ్మ పండుగ చేసుకుంటూ రాష్ట్రమంతా పూల పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. పూల పండుగ నిర్వహణలో అన్ని తానే వ్యవహరించారు.. గత ఏడాది దుబాయ్ లోని బుర్జు కలీఫా పై బతుకమ్మ బొమ్మ పడేలా చేసి.. పూల పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తో బతుకమ్మకు ట్యూన్ కట్టించిన ఘనత కూడా ఆమెకి దక్కుతుంది..

బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుంటున్న కవితమ్మ ఈసారి బతుకమ్మ వేడుకలకి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె బతుకమ్మ వేడుకలకు దూరం అవుతున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టై.. ఆరు నెలల పాటు బీహార్ జైల్లో గడిపారు ఆమె.. ఇటీవల జైలు నుంచి విడుదలైన కవితకు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.. ఈ క్రమంలో ఆమె ఇంటి నుంచి బయటికి రావడం లేదు.. ఈ క్రమంలో ఎంగిలి పూలతో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి.. అయితే ఎక్కడా కూడా కవిత కనిపించకపోవడంతో పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈసారి బతుకమ్మ వేడుకలకి కవితమ్మ రాదనే ప్రచారం జరుగుతోంది.. ఆరోగ్యం సహకరిస్తే సద్దుల బతుకమ్మకైనా కవితమ్మ వస్తారని ఆశగా చెబుతున్నారు జాగృతి కార్యకర్తలు..

Read more RELATED
Recommended to you

Latest news