హైదరాబాద్ అంటేనే రాక్స్, పార్క్స్, లేక్స్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

హైదరాబాద్ అంటేనే రాక్స్, పార్క్స్, లేక్స్ అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ నగరంలో మూసీ కూల్చివేతలు, హైడ్రా పై డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. నగరంలో గత కొన్నేల్లుగా కబ్జాలు జరుగుతున్నాయి.  హైదరాబాద్ లో దాదాపు 20 పార్కులకు పైగా పార్కులు కబ్జాకు గురయ్యాయి.  మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజా ఎజెండానే కానీ.. వ్యక్తిగత ఎజెండా మాకు లేదు. గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. మూసీ సుందరీకరణ పై ఎవ్వరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు అని..  హైడ్రా పేరుతో ప్రభుత్వం పై కొంత మంది విమర్శలు చేస్తున్నారు.  

 తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నగరాన్ని భవిష్యత్ తరానికి అందించాలి. చెరువుల ఆక్రమణ హైదరాబాద్ కు పెను ప్రమాదంగా మారింది. నగరంలో 2014కి ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి..ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి అనే వివరాలను సేకరించినట్టు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2014లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన చెరువులు ఎక్కడెక్కడా కబ్జాకు గురయ్యాయనే విషయాలను వివరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 

Read more RELATED
Recommended to you

Latest news