ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్.. 10 మంది సీనియర్లు సస్పెండ్..!

-

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం
వెలుగు చూసిన ఈ ఘటన పై అధికారులు చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా ర్యాగింగ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్ధినులు పది మంది పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు వైస్ ఛాన్స్ లర్.


ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులను సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ హాస్టల్లో డ్యాన్సులు వేయాలంటూ ర్యాగింగ్ కి పాల్పడ్డారు. ర్యాగింగ్ సమయంలో వీడియోలు తీసి వాట్సప్ గ్రూపులలో షేర్ చేసి కామెంట్స్ చేయడంతో క్లాస్ రూంలలో ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ప్రొఫెసర్లకు చెబితే ఎక్కడ సీనియర్లు తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తారో అని భయపడిపోయినట్టు సమాచారం.    మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు   మీడియాను ఆశ్రయించారు. దీంతో ర్యాగింగ్ అంశం బయటకి రావడంతో ఎంక్వయిరీ చేసిన యూనివర్సిటీ అధికారులు.. 10 మంది విద్యార్థినులను క్రమశిక్షణ చర్యలలో భాగంగా 15 రోజుల పాటు సస్పెండ్ చేసినట్టు వీసీ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news