రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు..!

-

రసాయన శాస్త్రంలో విశేషమైన పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్ర వేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి అవార్డు లభించింది. ప్రోటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు గాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసబిస్,జాన్ ఎం.జంపర్  ను ఈ ఏడాది నోబెల్ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సైన్ ప్రకటించింది.

కంప్యూటేషనల్ ప్రోటిన్ డిజైన్ కు గాను బెకర్, ప్రోటిన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ కు డెమిస్, జంపర్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైద్య విభాగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం అక్టోబర్ 14 వరకు కొనసాగుతుంది. సోమవారం వైద్య శాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. నిన్న భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. ఇవాళ రసాయన శాస్త్రంలో నోబెల్ కు పురస్కారానికి ఎంపికైన వారి జాబితా వెలువడింది. గురువారం సాహిత్యం విభాగానికి సంబంధించి ప్రకటన చేయనున్నారు. శుక్రవారం రోజు నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news