హర్యానాలో బిజేపీ విన్నింగ్ సీక్రెట్ ఇదేనా..?

-

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి హ్యాట్రిక్ కొట్టింది.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.. ప్రతిపక్షాలు ఏకమై.. ముప్పేటా దాడి చేసినా.. వ్యతిరేక ఓటు చీలకుండా.. ప్రయత్నాలు చేసినా.. కమలం పార్టీ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఎన్నికలు వెళ్లింది.. మూడోసారి కూడా తాము గెలుస్తామని మోడీ చెప్పిన మాటలను అక్కడి ప్రజలు నిజం చేశారు.. బిజేపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ చీల్చలేకపోయింది..

90 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలలో బీజేపీ బిజీయడంకా మోగించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.. ఎన్నికల షెడ్యూల్ చేసినప్పటి నుంచి.. గెలుపు పై ధీమాతో ఉన్న కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమై మరోసారి ఓటమి చవిచూసింది.. కాంగ్రెస్ తో పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసిన ఆప్.. ఖాతా కూడా తెరవలేదు.. గత ఎన్నికల్లో పది స్థానాలలో గెలిచి కింగ్ మేకర్ గా మారిన జన్ నాయక్ జనతా పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేక చతికలపడింది..

హర్యానాలో పదేళ్లకు అధికారంలో ఉన్న బిజెపి పై ఏర్పడిన వ్యతిరేకత, చాటు సామాజిక వర్గంలో ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం, క్రీడాకారులు పార్టీలో చేరడం రైతుల ఆందోళన అగ్నిపత్ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఎన్నికల చివరి నిమిషంలో చేర్చుకోవడం కూడా కాంగ్రెస్ కు మైనస్గా మారింది..రైతాంగ సమస్యలను కాంగ్రెస్ ప్రస్తావించినా..దాని వల్ల ఫలితం లేకపోయింది..

తమ పదేళ్ల పాలనలో అవినీతి, వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ఉద్యోగాలు ఇచ్చామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.. భూపేంద్ర హుడా పదేళ్ల పదవీ కాలంలో డబ్బు చెల్లించి, స్లిప్పుల ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చారని, అంటే సిఫారసుల ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చారని ఎక్స్‌పెండిచర్‌ స్లిప్‌ల వ్యవహారాన్ని బీజేపీ జనంలోకి తీసుకుపోగలిగింది. ఇది మాత్రమే కాదు, ఈ ఉద్యోగాలు రోహ్తక్ ప్రాంతం. జాట్ కమ్యూనిటీ ప్రజలకు కూడా పరిమితం చేయడాన్ని ప్రస్తావించింది. ఇది బిజేపీకి ప్లస్ అయింది..

సీఎంను మార్చడం కూడా బిజేపీకి విజయాన్ని తీసుకొచ్చింది.. జాట్ వర్సెస్ నాన్-జాట్ అనే వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీన్ని గ్రహించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆయనను తొలగించిన తీరు ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని రాబట్టుకోగలిగింది. ఇలా చేయడం ద్వారా పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను తుదముట్టించేందుకు బీజేపీ ప్రయత్నించింది. అతని స్థానంలో ఓబీసీ వ్యక్తి నాయబ్ సింగ్ సైనీకి ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తంగా హర్యానాలో హ్యట్రీక్ విజయం కోసం బిజేపీ తెరవెనుక అనేక వ్యూహాలను అమలు చేసిందని.. తద్వారా చిరస్మరణీయ విజయాన్ని అందుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news