హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ.229 కోట్ల భారీ మోసం!

-

తక్కువ పెట్టుబడికి డబుల్ లాభాలు ఇస్తామని ఆశ చూపించి రూ.229 కోట్ల భారీ మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వెలుగుచూసింది. DKZ టెక్నాలజీస్, డికాజో సొల్యూషన్స్ పేరుతో ఎండీ సయ్యద్‌ అష్ఫక్ రాహిల్, అతని భార్య డైరెక్టర్‌ సయీదా అయేషాలు కలిసి ప్రజలను నట్టేటా ముంచారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.229 కోట్లు కొల్లగొట్టారు.

రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.లక్ష లాభాలు ఇస్తామనిత, 3 నెలల్లో 15 శాతం, 6 నెలల్లో 25శాతం, ఏడాదికి 65 శాతం, రెండేళ్ళకు 100 శాతం లాభాలిస్తామని చెప్పి 17,500 మంది వద్ద నుంచి రూ.229 కోట్లను వసూలు చేసి బోర్డు తిప్పేశారు.గుడిమల్కాపూర్‌కు చెందిన డాక్టర్ అబ్దుల్ జైష్ రూ.2.74 కోట్ల పెట్టుబడి పెట్టి మోసపోయానని గ్రహించి సెబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాధితులు అంతా కలిసి రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక బ్యందాలతో దర్యాప్తునకు ఆదేశించారు. కంపెనీ ఎండీ సయ్యద్‌ అష్ఫక్, అతని భార్యను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13ల్యాప్ టాప్‌లు రూ. 1.7 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు.కాగా, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news