ప్రైవేట్ స్కూల్స్ మూత పడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలు అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా నల్గొండలో ఇంటిగ్రేటేడ్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కేజీ టూ పీజీ ఉచిత విద్యనందిస్తామని చెప్పారని.. మరి ఎందుకు అందించలేకపోయారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటేడ్ స్కూళ్లతో ప్రతీ విద్యార్థికి విద్యను అందించగలుగుతామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ మూతపడేలా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యను అందిస్తామని హామీ ఇవ్వలేదని.. బీఆర్ఎస్ ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తామని తెలిపారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీచర్లను కూడా బదిలీలు చేపట్టామని.. ఇటీవలే డీఎస్సీ నియామక పత్రాలను కూడా అందజేసినట్టు గుర్తు చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ డీఎస్సీ పరీక్షను ఎందుకు నిర్వహించలేదని నిలదీశారు.