దసరా పండుగ…జగన్‌ కీలక ప్రకటన

-

YS Jaganmohan Reddy: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడువైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు చెప్పారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Happy Vijaya Dashami to YS Jaganmohan Reddy

లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని శ్రీ వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news