భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆనం..!

-

క్షేత్ర స్థాయిలో ప్రతీ అధికారి అందుబాటులో ఉండి జిల్లాలో తుఫాను నష్టాలు ధీటుగా ఎదుర్కొనేలా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేసారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. జిల్లాలో భారీ వర్షాల ప్రభావం.. తీసుకున్న జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ తో చర్చించారు.

అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించిన మంత్రి.. ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది అన్నారు. అలాగే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు పునరావాస కేంద్రాల ఏర్పాటు పై ఆరా తీశారు. ఇక మంత్రి ఆనం సూచనలతో.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఆర్డీవో పావని.

Read more RELATED
Recommended to you

Latest news