జిమ్ ట్రైనర్ మర్డర్ కేసు.. బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అరెస్టు!

-

లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇటీవల ముంబైలోని ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య చేయించింది ప్రస్తుతం అహ్మదాబాద్ లోని సబర్మతి జైలులో ఖైదీగా ఉన్న బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. దీంతో ఈ గ్యాంగ్ పేరు చెబితేనే సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ వణికిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీలో జిమ్ ట్రైనర్ హత్యకేసులో ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అతను బిష్ణోయ్ గ్యాంగులో ఒకరిగా గుర్తించారు. ఢిల్లీ,మథుర పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఆగ్రా – మథుర హైవేపై నిందితుడిని పట్టుకున్నారు. అంతకుముందు బిష్ణోయ్ -హషీమ్ బాబా గ్యాంగ్ సభ్యుడైన యోగేష్‌కు మధ్య కాల్పులు జరిగాయి.దీంతో యోగేష్ కాలికి బుల్లెట్ గాయం అవ్వడంతో అక్కడే కుప్పకూలాడు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 12న యోగేష్.. ఢిల్లీలోని జిమ్ నిర్వాహకుడు నాదిర్ షాను హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news