సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద లాఠీచార్జీ.. వీడియో రిలీజ్!

-

సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపు ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆందోళనకారులు పోలీసులపైకి చెప్పు లు, రాళ్లు, కుర్చీలు విసిరారని.. అందుకే లాఠీచార్జ్ చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.‌ ఈ దాడిలో నలుగురు యువకులకు తలలు పగిలి తీవ్రంగా రక్తస్రావం జరిగింది.

మరో యువకుడి చేయి విరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ లాఠీచార్జీ ఘటనపై పెద్ద ఎత్తున రాష్ట్ర పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అందుకు సంబంధించిన వీడియోలను పోలీసుశాఖ విడుదల చేసింది. చెప్పు లు, రాళ్లు, కుర్చీలు విసరడం వల్లే పోలీసులు లాఠీచార్జి చేశారని పోలీసు ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ నెల 14న కుమ్మరిగూడ ముత్యా లమ్మ దేవాలయంలో సలీం అనే వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news