జియో రీచార్జి ప్లాన్లను కొద్ది రోజుల కిందట పెంచడంతో ఆ సంస్థకు యూజర్లు షాక్ ఇచ్చారు. నివేదికల ప్రకారం పెరిగిన టారిఫ్‌ల ప్రభావం వినియోగదారులపై పడింది.రెండో త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది కస్టమర్లు జియోకు గుడ్ బై చెప్పారు. అదే టైంలో జియో 5G సబ్‌స్క్రైబర్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగినట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి. గతంలో జియోయూజర్ బేస్ 130 మిలియన్లు ఉండగా, ఇప్పుడు 147 మిలియన్లకు చేరుకుంది.
ఇక ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. మొత్తంగా జియో సబ్‌స్క్రైబర్ బేస్ క్షీణించింది.తన యూజర్ బేస్‌కు సంబంధించి పరిస్థితి తమకు తెలుసని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని జియో పేర్కొంది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను అందించడంపైనే తమ దృష్టి ఉందని జియో తెలిపింది.