రుషికొండ ఏమైనా ప్రైవేట్ ప్రాపర్టీనా : బొత్స సత్యనారాయణ

-

డయేరియా బాధితులు ఇంకా మరొకొన్ని గ్రామాలలో ఉన్నారు. పదహారు మంది డయేరియా బారిన పడి మృతి చెందారు. కానీ అధికారులు ఒకటి రెండు అని చెప్పారు అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బాధితులు చనిపోవడానికి బహిరంగ మలవిసర్జన కారణమని ఇప్పుడు చెబుతున్నారు. గత వారసత్వ ద్వారా వస్తున్న లోపాలే ఇప్పుడు సరిచేసుకోవల్సి వస్తోందని పవన్ అన్నారు. గతంలో ఎన్నడూ పదహారు మంది చనిపోయిన దాఖలాలు జిల్లాలో గానీ చీపురుపల్లి లో గానీ లేవు.

ఈ రోజుకి నాగలవలసలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. పది రోజులలో నియంత్రణ చెయ్యకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం. బాధితులు అందరూ ఇదంతా మందులందక.. సాయం అందకే చనిపోయారు అని తెలిపారు బొత్స. అదే విధంగా రుషికొండ ఏమైనా ప్రైవేట్ ప్రాపర్టీనా… ప్రభుత్వ్వానికి కట్టాం..‌కావాలంటే అందులో లోపాలుంటే ఎంక్వైరీ చేయించండి. ఇంకా ఎక్వారీలకు ఎవ్వరో వస్తారట.. అప్పుడు చర్యలు తీసుకుంటారట.అధికారులపై పట్టు లేదు.. ఏం చెయ్యాలో క్లారటీ లేదు.. దోచుకుందామన్నదానిపై ఎంత సేపు దృష్టి అని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news