గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డీఎస్సీ వేయలేదు. విద్యాశాఖ రివ్యూకు గంట సమయం కూడా కేటాయించలేదు. ఎన్నిసార్లు కేసీఆర్ను అడిగిన కనీసం పట్టించుకోలేదు అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వ విధానాలు సరిగా లేవని అడిగినందునే కేసీఆర్ నన్ను పక్కన పెట్టిండు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తెలువదు. ఆయన తర్వాతి స్థానం కోసమే బావ బామ్మర్దులు హరీష్ రావు కేటీఆర్ పోటీ.
పేపర్లలో ఫోటోల కోసం పోటాపోటీ ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేయరు. ఎన్నికలప్పుడే పెయిడ్ ఆర్టికల్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు కూడా గతంలో సంపాదించిన అవినీతి సొమ్ముతో పెయిడ్ ఆర్టికల్స్ లైవ్ కార్యక్రమాలను BRS లీడర్లు పెట్టుకుంటున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను లూటీ చేసింది. దోచుకోవడమే లక్ష్యంగా కేటీఆర్ కెసిఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు లు పని చేసిండ్రు 2014 ముందు వారి ఆస్తులు.. ఇప్పుడున్న ఆస్తుల వివరాలను శ్వేత పత్రం విడుదల చేయాలి. నీతి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు కేసిఆర్ కుటుంబానికి లేనేలేదు. పదేళ్లలో నిరుద్యోగులకు ఏమీ చేయని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.