TPCC Chief Mahesh Kumar Goud Comments on Congress leader issue: హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదని పేర్కొన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక కాంగ్రెస్ పార్టీకో దండం రా బాబు అంటూ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపినట్టు చెబుతున్నారు స్థానికులు. దింతో రోడ్ పై బైఠాయించారు జీవన్ రెడ్డి. అయితే ఆయనను శాంతిప జేయడానికి అడ్లూరి లక్ష్మణ్ రంగంలోకి దిగారు.