MLC జీవన్ రెడ్డి కోసం రంగంలోకి కేటీఆర్ దిగారు. జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. పార్టీ మారిన నేతలపై వేటు వేయాలని జీవన్‌రెడ్డి అన్న వ్యాఖ్యలను షేర్ చేశారు. రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే.. మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా ? జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే.. ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని….మీ దిగజారుడు రాజకీయాలపై.. దుమ్మెత్తి పోశారని నిప్పులు చెరిగారు.
ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా ? క్షమాపణ చెబుతారా? అంటూ ఆగ్రహించారు. మీరు గడప గడపకు వెళ్లి… చేర్చుకున్న BRS ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయల్సిందేనని పట్టుబడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా ? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా ? ప్రోత్సహించిన మిమ్ములనా ? అంటూ పోస్ట్ పెట్టారు కేటీఆర్.
రేవంత్ గారు..
మీ సొంత పార్టీ నేతనే..
మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు
అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు..ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా ?
జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే..
ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని….మీ దిగజారుడు… pic.twitter.com/D9CTnAl6Ci— KTR (@KTRBRS) October 23, 2024