ఉచిత ఇసుక విధానంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

-

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం.. మధ్యాహ్నం 1:30 తరువాత ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

సీనరేజ్ చార్జీల వల్లే ప్రభుత్వంపై రూ. 264 కోట్లు భారం అని అంచనా వేసింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం బరిద్దామని చంద్రబాబు సూచించారు. ఉచిత ఇసుక సరిగా అమలు అయ్యేలా చూడాలంటూ జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.

ఇసుక లేని జిల్లాలలో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు. ఉచితంగా ఇసుక పంపిణీ పథకంలో ట్రాక్టర్లు, లారీలతో పాటుగా ఎడ్లబండ్లలో కూడా ఇసుక తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక చెత్త పన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news