ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కుటుంబంలో మరోసారి ఆస్తి వివాదం తలెత్తింది. తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల పై జగన్ మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో వాటాల కేటాయింపు పై వీరిద్దిరి పై పిటిషన్లు వేశారు జగన్. ఆస్తి పంపకాల విషయంలో విజయమ్మ, షర్మిల పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో జగన్ ఫిర్యాదు చేయడం సంచలనం గా మారింది.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటేడ్ షేర్ల వివాదం పై క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటేడ్ షేర్ల వివాదం పై క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటేడ్, జగన్ , భారతి రెడ్డి పేర్లతో 5 పిటిషన్లు వేశారు. వాస్తవానికి ఆగస్టు 21, 2019 ఎంవోయూ ప్రకారం.. విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని.. పలు కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.