రోగి పట్ల నిర్లక్ష్యం.. నారాయణ ఆస్పత్రికి రూ.5లక్షల ఫైన్!

-

అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించడంతో పాటు అతని అరచేతి పక్షవాతానికి కారణమైన ఏపీలోని నెల్లూరు నారాయణ ఆస్పత్రికి రూ.5 లక్షల జరిమానా విధిస్తూ జిల్లా వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన భవన నిర్మాణ కూలి షేక్ మక్సూద్ 2009 డిసెంబర్ 1న లాంగ్ బోన్ ఫ్రాక్చర్‌కు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.

డిశ్చార్జి అయిన తర్వాత విపరీతమైన చేతి వాపు, నొప్పితో బాధపడుతున్న ఆయనకు రెండోసారి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఫలితం లేకపోయింది. ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వడంతో బాధితుడి అరచేతి పక్షవాతం వచ్చింది. మళ్లీ అదే ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. దీంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన న్యాయమూర్తి బాధితుడికి రూ.5,01,490 నష్ట పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లించాలని నారాయణ ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news