వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమిళగ వెట్రి కళగం పోటీ.. విజయ్ దళపతి కీలక వ్యాఖ్యలు

-

వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమిళగ వెట్రి కళగం పోటీ చేస్తుందని విజయ్ దళపతి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు విల్లుపురంలో మిళగ వెట్రి కళగం తొలి మహానాడులో దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ రంగంతో పోల్చితే.. రాజకీయాలు పాము లాంటివని అన్నారు. పార్టీలో అందరూ సమానమేనని భారీగా తరలివచ్చిన అభిమానులకు స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో చిన్నపిల్లాడినే కావొచ్చు కానీ ఎవరికీ భయపడేది లేదన్నారు. సినిమాల కంటే రాజకీయాలపైనే తాను ఎక్కువ దృష్టి పెడతానని చెప్పారు.

 


తమిళనాడులో ఒక్క బీజేపీ  మినహా అన్నీ ఒకే తరహా అనుకోవచ్చు. కానీ, ఎవరి విధానం వారికి ఉందని అన్నారు. అంతేకాదు.. ఈ సభలో తన పార్టీ భావజాలాన్ని విజయ్  ప్రకటించారు. ఆయన కూడా డీఎంకే బాటలో పయనిస్తున్నట్లు సంకేతం పంపించారు. ఒకటే కులం.. ఒకరే దేవుడు అనేదే తన విధానమని ప్రకటించారు. ఇక తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి సభ వేదికగా సమాధానం ఇచ్చారు విజయ్.

Read more RELATED
Recommended to you

Latest news