బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR బంధువు రాజ్ పాకాల జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగినట్లు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు.
రేవ్ పార్టీ ఎట్లా ఉంటుందో తెలియదు. కొకైన్ అంటే కూడా పేపర్ లో చదివి తెలుసుకున్నాని
కిషన్ రెడ్డి అన్నారు. ఫామా హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందో లేదో సమగ్రంగా విచారణ జరగాల్సిన
అవసరం ఉందన్నారు.
ఎవరి ఫామ్ హౌస్ అయిన సీఎం బంధువు అయినా, మాజీ ముఖ్యమంత్రి బంధువు అయినా దర్యాప్తు జరపాలని, ఈ వ్యవహారంపై బీజేపీ స్టాండ్ ఇదేనని స్పష్టం చేశారు. మద్యం పర్మిషన్ లేకుండా లిక్కర్ సరఫరా చేశారని పోలీసులు చెప్పినట్లు స్క్రోలింగ్ వస్తుందని తెలిపారు. డ్రగ్పై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాలని, చట్టం తన పని తాను చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దీనిపై బీఆర్ఎస్ BRS నాయకులు మాట్లాడుతున్నారు.. ఒక పథకం ప్రకారం కావాలనే అక్రమ
కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారని చెప్పారు.