సంగారెడ్డిలో రెండు లారీలు ఢీ కొట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ఇద్దరు క్లినర్లు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డిలోని సదాశివపేట వద్ద NH 65పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంతో ఢీ కొట్టింది మరో లారీ. అయితే… లారీ టైర్ పంచర్ కావడంతో పక్కకు ఆపాడు డ్రైవర్.
ఈ తరుణంలోనే..హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంతో ఢీ కొట్టింది మరో లారీ. దీంతో స్పాట్ లోనే ఇద్దరు క్లినర్లు మృతి చెందారు…రెండు లారీల మధ్యలో ఇరుక్కున్నాయి మృతదేహాలు. క్యాబిన్ లో ఇరుక్కున్న లారీ డ్రైవర్ ని అరగంట పాటు శ్రమించి బయటికీ తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.