సీఎం రేవంత్ రెడ్డిని జైలులోనే చంపాలని చూశారు.. షబీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

-

జన్వాడ ఫామ్ హౌజ్ పై వాస్తవాలు చూపించినందుకు గతంలో రేవంత్ రెడ్డిని 40 రోజుల పాటు జైలులో ఉంచారని.. జైలులోనే రేవంత్ ని చంపాలని చూశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌజ్ లో దొరికిన లిక్కర్, డ్రగ్స్, అమ్మాయిలు, అబ్బాయిల వివరాలను బయటపెట్టాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు. డ్రగ్స్ తో అడ్డంగా దొరికి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ముందు కేటీఆర్ నార్కొటిక్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. చట్టం తెలిసిన వ్యక్తులే తప్పులు చేస్తే.. పోలీసులు కేసులు పెట్టకుండా ఇంకేమి చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు డ్రగ్స్ అనగానే కేటీఆర్ ఎందుకు స్పందిస్తున్నారని అడిగారు. జన్వాడ ఫామ్ హౌజ్ కు విదేశీ మద్యం ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ బావమరిది పేకాట ఆడుతూ డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికి సంచలన ఆరోపణలు చేశారు షబ్బీర్ అలీ. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి.. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news