చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంపదను ప్రవేట్ పరం చేయడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తన మనుషులకు పప్పు బెల్లాలుగా చంద్రబాబు విక్రయిస్తున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజల సంపదను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఇందులో భారీ కుంభకోణం ఉంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కళాశాలాలను తీసుకువచ్చారు. పేద విద్యార్థులు వైద్య విద్యను అభిలాషించాలనే కోరికను వారికి దూరం చేశారు. డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు వచ్చేలా చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు రాష్ట్రం అప్పుల్లో ఉందని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆల్విన్ ను అమ్మేశారు చక్కెర ఫ్యాక్టరీలను కూడా విక్రయించారు. మొత్తం 54 సంస్థలను ఆయన హయాంలో అమ్మేశారు. ఇప్పుడు కూడా అదే పనికి ఉపక్రమించాడు. దీనిని ప్రజలు వ్యతిరేకించాలి. జగన్ హయాంలో ఎన్నో ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి. జగన్ నిర్ణయాల వల్ల జీడీపీ కూడా పెరిగింది అని గోవర్ధన్ రెడ్డి అన్నారు.