ఏపీ ప్రజలకు శుభవార్త..ఇవాళ ఉ.10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పై కీలక ప్రకటన చేసింది నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి గ్యాస్ ఫ్రీ బుకింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారుల అన్ని ఏర్పాటు చేశారు. గ్యాస్ కనెక్షన్ అలాగే రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద ఈ కేవైసీ చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ap free cylinders

పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ను తీసుకుంటే రెండు రోజుల్లో ప్రభుత్వం ఆ డబ్బు జమ చేస్తుంది అని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫోన్ చేయాలని కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక మొదటి సిలిండర్ను మార్చి 31వ తేదీ లోపు ఇవ్వనుంది. రెండవ సిలిండర్ జూలై 31వ తేదీ లోపు అందించనుంది చంద్రబాబు ప్రభుత్వం. మూడవ సిలిండర్ నవంబర్ 30వ తేదీ లోపు… తీసుకువచ్చని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news