ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్లీ ఏపీకి రానున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి… ఇవాళ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాల్టి నుంచి రెండు రోజులపాటు కడప జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు.
ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. ఇందులో భాగంగానే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు నేరుగా రానున్నారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి హెలికాప్టర్లో… వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు చేరుకుంటారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో కడప జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ బలోపేతం పైన కూడా… నేతలతో చర్చించబోతున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్ భారతి కూడా ఇడుపులపాయకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.