HYD : డ్రగ్స్ అమ్ముతున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్

-

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల వినియోగం అమాంతం పెరిగిపోయింది. నిరుద్యోగ యువత, కాలేజీ విద్యార్థులు డ్రగ్స్‌కు ఎక్కువగా బానిసలు అయినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ పోలీసులు, తెలంగాణ యాంటీ నారోటిక్‌ బ్యూరో, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్న క్రమంలో ఎక్కడో ఒకచోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. పేరెంట్స్ తమ పిల్లల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నా యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్నారు.

తాజాగా నగరంలోని వనస్థలిపురంలో ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డాడు.సుష్మ థియేటర్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన జాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.అతడి నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు గ్రాము రూ.2,500 చొప్పున కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news