హైదరాబాద్ విషాదం…ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బలైన బీటెక్‌ విద్యార్థి..!

-

హైదరాబాద్ విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బీటెక్‌ విద్యార్థి..బలి అయ్యాడు.
హైదరాబాద్ ఘట్ కేసర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న బత్తిని గణేష్…ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బలి అయ్యాడు.

HYDERABAD CRIME ONLINE GAMES

ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై ఫ్రెండ్స్ వద్ద భారీగా అప్పులు చేసిన గణేష్..ఇటీవల దసరా పండుగకు ఇంటికి వెళ్లి కాలేజీ ఫీజు కట్టేందుకు రూ.80 వేలు తీసుకుని ఆన్ లైన్ గేమ్స్ లో పోగొట్టుకున్నాడు. ఈ తరుణంలోనే తీవ్ర మనస్తాపంతో కాలేజీ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పదేళ్ల క్రితమే గణేష్ తండ్రి..చనిపోయాడు. ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తూ కొడుకుని బీటెక్ చదివిస్తోంది తల్లి. ఇక ఇప్పుడు గణేష్ మృతితో బోరున విలపిస్తోంది తల్లి. హైదరాబాద్ ఘట్ కేసర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న బత్తిని గణేష్…ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బలి ఐన తరుణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news