విలేకరి హత్య కేసు.. మాజీ మంత్రి బెయిల్ పిటిషన్ పై నవంబర్5న తీర్పు

-

కాకినాడ జిల్లా తుని మండలంలో సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసులో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని చెప్పవచ్చు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. నవంబర్ 05న తీర్పు వెలువడనుంది. వివరాల్లోకి వెళ్లితే.. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేస్తున్నాడు సత్యనారాయణ.

అయితే 2019 అక్టోబర్ 15న రాత్రి తన బైకు పై ఎస్. అన్నవరంలోని తన ఇంటికి వెళ్తుండగా.. లక్ష్మీదేవి చెరువు గట్టు పై కొందరూ అడ్డుకొని కత్తులతో దాడి చేశారు. దీంతో సత్యనారాయణ మరణించాడు. ఈ హత్యకు దాడిశెట్టి రాజా సూత్రదారి అని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రాజా మంత్రి అయ్యాక ఈ కేసు ముందుకు సాగలేదు. 2023లో ఛార్జీ షీట్ లో ఆయన పేరును తొలగించారు. సత్యనారాయణ సోదరుడు కాతా గోపాల కృష్ణ లాయర్ కావడంతో రాజా పై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, NHRCతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దాడిశెట్టి రాజా ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు.  

Read more RELATED
Recommended to you

Latest news