ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా BRS పార్టీ సంబరాలు

-

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా BRS పార్టీ సంబరాలు జరుగనున్నాయి. కరెంటు చార్జీల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గింది. దింతో నేడు, బీఆర్ఎస్ సంబరాలు నిర్వహించనుంది. రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు నేడు బీఆర్ఎస్ సంబరాలు నిర్వహించనుంది.

ఈ మేరకు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సంబరాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాగా, తెలంగాణలో ఇప్పట్లో విద్యుత్‌ ఛార్జీల పెంపు లేనట్లే. ఏ కేటగిరిలోనూ ఛార్జీల పెంపు లేదని ప్రకటించిన ఈఆర్సీ. డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించింది ఈఆర్సీ. కొద్దిరోజుల క్రితమే విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని ఈఆర్సీ చైర్మన్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఛార్జీలు పెంపుకు వ్యతిరేకంగా సిరిసిల్లలో ఈఆర్సీ బహిరంగ విచారణలో కూడా పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news