చిట్టినాయుడు.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? – KTR కౌంటర్

-

ktr slams revan reddy over KCR: చిట్టినాయుడు.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? అంటూ KTR కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు కనిపించకుండా చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. చిట్టినాయుడు.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని చెప్పారు.

ktr slams cm revanth reddy over health depart ment

నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడని పేర్కొన్నారు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడన్నారు. సాధించుకున్న తెలంగాణను నువ్వు సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోసాడని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news