మేము ఏ కార్యక్రమం చేసిన పని పెట్టుకొని బురద జల్లుతున్నారు. వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్, హరీష్, కేటీఆర్ లకు చిన్న చూపు అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యిండు. దళితుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ అన్నారు.
ఫామ్ హౌస్ లో లిక్కర్, డ్రగ్స్ తో అడ్డంగా దొరికి పోయి దీపావళి పండుగ దావత్ చేస్తే తప్పేంది అంటున్నారు. హరీష్ రావు ఋణమాపి చేయలేదు అంటుండు. 22వేల మందికి 2లక్షల ఋణమాపి 18 వేల కోట్లు చేసినం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ దేశంలో మొదటి సారి బీసీ కులగణన ఏర్పాటుకు కేబినెట్ తీర్మానం చేశాం. వెనుకబడిన కులాల మీద వాళ్లకు ప్రేమ లేదు. ఫ్లోర్ లీడర్ నువ్వే ఉంటావ్. మా పీసీసీ చీఫ్ బలహీన వర్గాల నేత. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ప్రెస్ నోట్ అయిన విడుదల చేయాలి. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుంది అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.