పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ రక్తపుటేర్లు పారిస్తోంది.గాజా, లెబనాన్‌పై ఆ దేశం తాజాగా జరిపిన దాడుల్లో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఒక్క గాజాలోనే 143 మంది దుర్మరణం పాలవ్వగా.. లెబనాన్‌లో ఆ సంఖ్య 77కు చేరింది. ఇక లెబనాన్‌లో 33 మంది ఇజ్రాయిల్ సైనికులు మరణించినట్లు ఐడీఎఫ్ ధృవీకరించింది. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది.
ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడిలో 55మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు ఆ దేశ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది.శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పాలస్తీనా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కాగా, గాజా ఉత్తర ప్రాంతంలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్న 5 అంతస్తుల భవనంపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 109 మంది మరణించగా.. ఉత్తర గాజాలో నలుగురు ఇజ్రాయెలీ సైనికులు మరణించారు.