ఏపీలోని అనంతపురం జిల్లాలో అనుకోకుండా దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కలెక్టరేట్ భవనంలో తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. తుపాకీ శుభ్రం చేస్తుండగా ప్రమాదవ శాత్తు ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజు భూజానికి తీవ్రగాయమైనట్లు తెలిసింది. గమనించిన కలెక్టరేట్ సిబ్బంది వెంటనే ఆయన్ను హుటిహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం సుబ్బరాజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. విజయవంతంగా బుల్లెట్‌ను తీసివేసినట్లు పేర్కొన్నారు. తుపాకీ మిస్ ఫైర్ అయిన సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.