కాంగ్రెస్ గ్యారంటీలపై ఖర్గే వ్యాఖ్యలు.. కేటీఆర్ కౌంటర్..!

-

తెలంగాణ ప్రజలను నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ను మించి గ్యారెంటీలు ఇవ్వకూడదని.. అలా చేస్తే.. దివాళా తీసే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

గాలిమాటలు గ్యారంటీలు ఇస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థం అయిందా..? కర్ణాటకలో 5 గ్యారెంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తుకు రాలేదా..? బడ్జెట్ చూసుకోకుండా హామీలు ఇస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా మీకు. ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి మీకు తెలియదా..? తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు ఈ విషయాలు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. కేవలం అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆడిన గ్యారంటీల గారడీతో తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైంది. పదేళ్ల పాటు ప్రగతి పథంలో పరుగులు పెట్టిన తెలంగాణను అడ్డగోలు హామీలతో ఆగం చేశారని అంగీకరించాలి. గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిది అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news