‘ స‌రిలేరు నీకెవ్వ‌రు ‘ 2 డేస్ క‌లెక్ష‌న్స్‌… మాస్‌లో మ‌హేష్ వీరంగం..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు… నాలుగు సూప‌ర్ హిట్ సినిమాల డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సరిలేరు నీకెవ్వ‌రు సంక్రాంతి కానుక‌గా శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ నెల 11న రిలీజ్ అయిన స‌రిలేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడుతోంది. రెండో రోజు మ‌రో బిగ్ సినిమా అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ్ ఉండ‌డంతో డ్రాప్ వ‌చ్చినా కూడా భారీ వ‌సూళ్లే రాబ‌ట్టింద‌ని చెప్పాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి రోజు 32.64 కోట్ల షేర్ మార్క్ తో అల్ టైం టాలీవుడ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల‌లో నాలుగో ప్లేస్‌లో నిలిచింది. ఇక రెండో రోజు అల వైకుంఠ‌పురంతో పోటీ త‌ట్టుకుని సుమారు 9.5 కోట్ల షేర్ సాధించి రెండు రోజుల్లో రు. 42 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసింది. ఇక ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు.101 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. అటు ఓవ‌ర్సీస్‌లో కూడా ఇప్ప‌టికే మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసి 1.5 మిలియ‌న్ మార్క్‌కు చేరువ అవుతోంది.

ఇక సోమ‌వారంతో పాటు పండ‌గ మూడు రోజులు ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పండ‌గ చేసుకోవ‌డం ప‌క్కా. ముఖ్యంగా బీ, సీ సెంట‌ర్ల‌లో స‌ర‌లేరుకు అదిరిపోయే వ‌సూళ్లు వ‌స్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు ఆంధ్ర – తెలంగాణ 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం – 12.70 కోట్లు

సీడెడ్ – 5.44 కోట్లు

గుంటూరు – 5.7 కోట్లు

ఉత్తరాంధ్ర – 5.56 కోట్లు

ఈస్ట్ – 4.04 కోట్లు

వెస్ట్ – 3.18 కోట్లు

కృష్ణా – 3.90 కోట్లు

నెల్లూరు – 1.58 కోట్లు
—————————————————
2 డేస్ ఏపీ + తెలంగాణ షేర్ = 42.1 కోట్లు
—————————————————

Read more RELATED
Recommended to you

Latest news