మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు అరెస్ట్ అయ్యాడు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు యతేంద్ర రామకృష్ణ అలియాస్ రామును అరెస్టు చేశారు ఆత్కూర్ పోలీసులు. భార్యాభర్తల గొడవలో మెయింటెనెన్స్ కోసం కోర్టును ఆశ్రయించారు రాము భార్య.
అయితే… కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో… మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు యతేంద్ర రామకృష్ణ అలియాస్ రామును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. కానీ టీడీపీ పార్టీ ఆఫీసుపై జరిగిన రాళ్ల దాడి కేసులో రామును అరెస్టు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీ పార్టీ సోషల్ మీడియా అదే ప్రచారాన్ని చేస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు యతేంద్ర రామకృష్ణ అరెస్ట్ పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.