రాష్ట్రంలో ఇసుక, మద్యం విషయంలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. శనివారం అనకాపల్లి జిల్లాలో వెన్నెలపాలెంలో రహదారిపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత ఇసుకలో ఎక్కడా రాజీ లేదని, దొంగతనంగా వ్యాపారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు.
అక్రమార్కుల పై పీడీ యాక్ట్ పెడతామని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మద్యంపై ఇష్టానుసారం రేట్లు పెంచితే ఊరుకోనని అన్నారు చంద్రబాబు. ఇక తిరుపతి జిల్లాలో మూడేళ్ల బాలిక రేప్ కేసు పై సీఎం మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
గంజాయి మద్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మహిళలు ఆట వస్తువులు కాదని, ఆడపిల్ల జోలికి వస్తే అదే చివరి రోజు అని వార్నింగ్ ఇచ్చారు. చిన్నారులపై అత్యాచారాలు జరగడం దారుణం అన్నారు చంద్రబాబు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇద్దరు, ముగ్గురిని నడిరోడ్డుపై ఉరితీయాలని, అప్పుడే అలాంటి వాళ్ళు దారికి వస్తారని వ్యాఖ్యానించారు.