సూపర్ సిక్స్ హామీలను ప్రజలు బలంగా నమ్మడం వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలకంగా ఉన్నారు.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.. అందులో భాగంగా ఏడాదికి మూడు ఉచిత సిలీండర్ల పథకాన్ని చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు.. అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది..
వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.. అయితే ఉచిత బస్సు ప్రయాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.. అధికారంలోకి వచ్చిన నెలలోపే దీన్ని అమలు చేస్తామని తొలుతా ప్రకటించారు.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.. అయితే ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న రెండు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేసి వచ్చిన అధికారులు అందులో లోటుపాట్లను కూడా చంద్రబాబుకు వివరించారట..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయోజనం కంటే ప్రభుత్వానికి ఎక్కువ నష్టం జరుగుతుందని అధ్యయనం చేసిన అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట.. అందువల్లనే ఈ పథకం అమలు చేయకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.. సరిపడ ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో పాటు.. ఈ పథకాన్ని అమలు చేస్తే ఆటో డ్రైవర్లు కూడా ఆందోళనలు చేస్తారని చంద్రబాబుకు పలువురు అధికారులు వెల్లడించారని తెలుస్తోంది.. ఈ నేపధ్యంలో ఈ పథకం అమలుపై చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని టాక్ వినిపిస్తోంది..
ఏపీ ఆర్టీసీ ఇప్పటికే నష్టాల ఊబిలో కొట్టిమిట్టాడుతోంది..మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే.. ఇక ఆర్టీసీ కోలుకోవడం కష్టమని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.. దానికితోడు కొత్త బస్సులను కొనలేని పరస్థితి ఏర్పడింది.. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి సిటీల్లో బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉంది.. ఇవన్నీ బేరీజు వేసుకున్న చంద్రబాబు.. ఈ పథకంపై ఆలోచనలో పడ్డారట.. ఈ పథకం ఇప్పట్లో అమలు చేసే చాన్సే లేదని.. స్వంత పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.. దీనిపై చంద్రబాబు ఎప్పుడు ప్రకటన చేస్తారో చూడాలి..