చిరంజీవి సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌.. కొరటాలకు 40 రోజులే డెడ్‌లైన్‌

-

మెగా స్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. మరోసారి చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఖైదీనంబర్‌: 150’ సినిమాలోని ఓ పాటలో రామ్‌ చరణ్‌ తన డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ముచ్చ‌ట‌గా మూడో సారి కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో సంద‌డి చేయ‌నున్నారు. వినోదం .. సందేశం కలగలసిన కథతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కొత్త లుక్ తో కనిపించనున్నారు. కథానాయికగా త్రిష పేరు వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో చరణ్ కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అది నిజమేననేది తాజా సమాచారం. కథా పరంగా చిరంజీవి యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం చరణ్ 40 రోజులను కేటాయించినట్టుగా చెబుతున్నారు. తెరపై ఆ పాత్ర నిడివి ఎంతవరకూ ఉంటుందో తెలియదుగానీ..కొరటాల ఏదో పెద్ద ప్రయోగమే చేయనున్నాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news