వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి BRS నేతలు రాష్ట్రంలో సర్పంచులు గురించి మాట్లాడ్తున్నారు. BRS టైంలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయినవారే మద్దతుగా ధర్నా లు చేస్తున్నారు అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్పంచుల బకాయిలకు మా ప్రభుత్వం గ్యారెంటీ. మీరు పొలిటికల్ పార్టీల ట్రాప్ లో పడకండి. రాష్ట్రంలో సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరమా లేదు. సర్పంచులకు మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అని ఆయన భరోసా ఇచ్చారు.
ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికి తెలుసు. కాబట్టి ఓపిక పట్టండి. మార్చి నెలాఖరు లోగా బకాయిలు చెల్లిస్తాం. కేంద్ర ప్రభుత్వం పది ఏండ్ల నుండి చేసింది ఏంటో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి. అమర వీరుల స్థూపం దగ్గర చర్చకు రావాలి. వరద నష్టం నివేదిక కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ కు ఇచ్చాం. పది వేల కోట్ల నష్టానికి 400 వందల కోట్లు ఇచ్చారు. ఇక మూసీ పరివాహక ప్రాంతాలను BRS రెచ్చగొట్టే కార్యక్రమం ముగిశాక న్యాయం చేయడానికి మేము వెళతాం అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.