నామాటలను ఆ పార్టీ నేతలు వక్రీకరించారు : కస్తూరి

-

నామాటలను డీఎంకే పార్టీ నేతలు వక్రీకరించారు అని నటి కస్తూరి అన్నారు. నేను తెలుగు జాతీ గురించి తప్పుగా మాట్లాడలేదు. నేను తెలుగు వారిని ఒక్క మాట అనలేదు. నేను ద్రావిడవాదులను మాత్రమే గురించి మాట్లాడాను. తెలుగు నుండి నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి‌.. వస్తున్నాయి. లడ్డు గురించి తప్పుగా డిఎంకే వింగ్ ప్రచారం చేశారు. డీఎంకే వాళ్ళు తెలుగు వారిని అవమానపరుస్తున్నారు. అందుకే వారిని ప్రశ్నించాను.. దానికి నాపై తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని ఆమె తెలిపింది.

అలాగే నేను మాట్లాడింది కోందరిని ఉద్దేశించేంది మాత్రమే. తెలుగు నా మెట్టినిల్లు. తెలుగు వారంతా నా కుటుంబం. ఇది తెలుసుకోకుండా కొందరు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. తెలుగు ప్రజలు నాపై ప్రేమను, అభిమానాన్ని చూపుతున్నారు. కానీ నేను చేసిన వ్యాఖ్యలను డీఎంకే వక్రీకరించి.. నాపై వ్యతిరేకత తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. డీఎంకే చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని కస్తూరి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news