అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

-

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక ఐపీఎస్ ను ప్రత్యేక అధికారిని నియమించింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాలలో కొనుగోళ్లు చేపట్టాలని.. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని సీఎం ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.

ప్రత్యేకాధికారులు వీరే :

ఆదిలాబాద్, నిర్మల్​, కుమ్రంభీం అసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాలకు కృష్ణ ఆదిత్య.  కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు ఆర్​వీ కర్ణన్. ​ నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేటకు అనితా రామచంద్రన్.  నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు డా. ఏ.శరత్ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాలకు డి.దివ్య.  మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ మరియు నాగర్‌కర్నూల్ జిల్లాలకు రవి.  వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు టి.వినయ కృష్ణ రెడ్డి.  మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు హరిచందన దాసరి.  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కె.సురేంద్ర మోహన్ నియమించింది ప్రభుత్వం. 

Read more RELATED
Recommended to you

Latest news