చికాగో వర్సిటీ లైబ్రరీలో తెలంగాణ ఉద్యమ భాండాగారం.. గంటా చక్రపాణి ఆసక్తికర పోస్ట్

-

ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయ లైబ్రరీలలో ఒకటైన చికాగో యూనివర్సిటీ లైబ్రరీలో తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విషయాలను TGPSC మాజీ చైర్మన్, ప్రొఫెసర్ గంటా చక్రపాణి తాజాగా ఎక్స్ వేదికగా ఫొటోలను షేర్ చేశారు. తెలంగాణ బుద్దిజీవులు చేసిన గొప్ప మేలు ఈ నేల ఆకాంక్షలను.. పోరాటాల చరిత్రను వారసత్వాన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రస్థానాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేయడమన్నారు.

స్కూల్ పిల్లవాడిగా ఉద్యమాన్ని గమనించి, చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు, రచయితలు నాయకుల పరిచయం కలిగి ఉండి ఇంట్లో ఉద్యమ వాతావరణంలో పెరిగిన మా అబ్బాయి మిలింద్ ఇవాళ తన యూనివర్సిటీ చికాగో లైబ్రరీలో తెలంగాణ ఉద్యమ భాండాగారాన్ని చూసి ఉధ్వేగానికి లోనయ్యాడని పేర్కొన్నారు. రాహుల్ మిలింద్ చేసిన ట్వీట్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. త్యాగాలతో ఏర్పడిన గొప్ప ప్రజాస్వామ్య పోరాటం.. తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలను లైబ్రరీలో ఏర్పాటు చేసినందుకు మా తరుపున చికాగో విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు చెప్పు అంటూ రాహుల్ మిలింద్ కు ట్వీట్ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news