ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ మొదలుపెట్టి వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేసాం. గంట పాటు సీఎం మాతో మాట్లాడారు అని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కు సీఎం చంద్రబాబు ముందుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధమే అని 7 గురు జడ్జిల సుప్రీంకోర్టు బెంచ్ తీర్పునిచ్చింది. తమిళనాడు ఇచ్చిన చట్టాన్నే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమీషన్ వేసారు.
ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ జాప్యం లేకుండా మరింత వేగవంతంగా చేయాలి
ఆరు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సిద్ధంగా ఉంది. ఎస్సీ వర్గీకరణ కోసం ఒక కమీషన్ వేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. కమీషన్ రిపోర్టు వచ్చి వర్గీకరణ జరిగే వరకూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేసాం. కమీషన్ రిపోర్టు వచ్చే వరకూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వనని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. జస్టిస్ రామచంద్రరాజు కమీషన్ తీసుకున్న లెక్కలు ఇప్పుడు మారాయి. 2011 లెక్కలు పరిగణనలోకి తీసుకుని 15 నుంచి నెల రోజుల్లోనే నివేదిక వచ్చేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు అని మంద కృష్ణ మాదిగ తెలిపారు.