ఎలక్షన్ కమిషన్ వీలైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు 18వ తేదీ వరకు పొడిగించాలి అని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కోరారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి, ప.గోదావరి, తూ. గోదావరి పట్టభద్రుల నియోజకవర్గానికి ఫిబ్రవరి నెలాఖరులో గానీ, మార్చి మొదటి వారంలోగానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం నవంబరు 6న ఓటరుగా నమోదు చేసుకోవడానికి చివరి రోజు. నమోదులో ఉదాసీనత, నిర్లిప్తత కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరుల్లో ఓ రకంగా నమోదైనా.., ఈస్ట్, వెస్ట్, గోదావరి నియోజకవర్గాలలో నమోదు నత్తనడకన సాగుతోంది. చివరి తేదీకల్లా ఈ రెండు గ్రాడ్యుయేట్ నమోదు ముమ్మరం అవుతుందని భావిస్తున్నాం.
కనీసం 3 లక్షల 50 వేల వరకు రెండు రోజుల్లో నమోదు కావాలని ఆశిస్తున్నాం. చివరకు 4 లక్షల వరకు ఈ నమోదు సంఖ్య చేరాలి. ఈ రెండు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలి. మార్చిలో 3 చోట్ల జరిగిన టీడీపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి ఇప్పటికి 4 నెలలే అయింది ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే నాలుగు నెలల కాలం సరిపోదు అని రామకృష్ణ పేర్కొన్నారు.