రేపు సమావేశం కానున్న ఏపీ కేబినెట్..!

-

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం.. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు.. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణల పైనే ఉన్నట్టు గుర్తించారు.

ప్ర‌స్తుత చ‌ట్టంతో అక్ర‌మార్కుల‌పై చ‌ర్య‌ల‌కు ఇబ్బందులు ఉన్నాయ‌ని భావిస్తున్న ప్రభుత్వం.. దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చ జరపనుంది. దీనికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77 ను కూడా రద్దు చేయనున్న మంత్రివర్గం.. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news