నంద్యాల ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

-

ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం తెల్లవారుజామున నంద్యాల పట్టణంలోని శ్రీకరి ఆసుపత్రి‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. సిబ్బంది ఎవరూ సకాలంలో స్పందించకపోవడంతో క్రమంగా మంటలు పై అంతస్తుకు సైతం చేరుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఘటన జరిగిన టైంలో ఆసుపత్రిలో రోగులు ఉండటంతో సిబ్బంది అద్దాలు ధ్వంసం చేసి రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు.కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news