ఏపీలో విద్యుత్ చార్జీల సర్దుబాటును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నాచౌక్లో పీసీసీ చీఫ్ షర్మిల ఆందోళనకు దిగారు. కరెంటు బిల్లు-జేబుకు చిల్లు, వైసీపీ పాపం-కూటమి శాపం అంటూ నినాదాలు చేశారు. విద్యుత్ చార్జీల సర్దుబాటుపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారంతాడిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన 5 నెలలకే చంద్రబాబు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఇది ప్రజలకు షాక్ కదా? వాళ్లేం పాపం చేశారు? మీకు ఓట్లు వేయడమే వారికి శాపమా? అని ఆమె ప్రశ్నించారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన ఏపీలో లోటు బడ్జెట్ ఏర్పడిందని, డిస్కంలు నష్టాల్లో కూరుకుపోకుండా ఉండేందుకు విద్యుత్ చార్జీలను సర్దుబాటు చేస్తున్నట్లు కూటమి నేతలు చెబుతున్న విషయం తెలిసిందే.