ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 2014-15 నుంచి 2018-19 సంవత్సరాల మధ్యపూర్తయిన గ్రామపంచాయతీ రాజ్ గ్రామాణాభివృద్ధి పనుల బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. సీఆర్డీఏ పరిధి పునరుద్ధరణకు ఆమోదం. ఏపీ జీఎస్టీ2024 సవరణ చట్టంను కేబినెట్ ఆమోదించింది.
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొటెక్షన్ బిల్ 2024, ఏపీ పబ్లిక్ ఎంప్లాయి మెంట్ యాక్ట్ 1984 సవరణ, గూడ్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు 2024, ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024, స్పెషలైజ్డ్ డెవలప్ మెంట్ అథారిటీలు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ డస్బర్సల్, వంటి వాటిని కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అందుతున్న 80 శాతం ఫిర్యాదుల్లో భూవివాదాలు ఉంటున్నాయని ప్రభుత్వం గుర్తించింది. వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు సమాచారం.